Happy Birthday Allu Arjun | మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో.. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు.

అంతేకాకుండా.. డ్యాన్స్‌, స్టైలిష్‌లుక్‌తో యూత్ ఐకాన్‌గా నిలిచాడు.. నేడు ఫుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అల్లు రామలింగయ్య మనవడిగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్‌ తెరంగేట్రం బాగానే జరిగింది. అటు మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు  అర్జున్.

ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో  చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన గంగోత్రితో హీరోగా ప్రమోషన్ పొందాడు. అంతేకాదు టాలీవుడ్‌లో హీరోగా పంతొమ్మిది యేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.

19 యేళ్ల కెరీర్‌లో 20 సినిమాలు చేసాడు. యావరేజ్‌గా యేడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేసాడు.